వాట్సాప్ చాటింగ్‌పై అనుమానం.. గర్భిణీ నవ వధువును చంపేసిన భర్త..!
Publish Date:Sep 14, 2026
Advertisement
పెళ్లయి తొమ్మిది నెలలే.. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు.. అప్పటికే గర్భం దాల్చిన భార్య.. కానీ భర్త అనుమానం ఆ కుటుంబం లో విషాదాన్ని నింపింది. వాట్సాప్‌లో మరో వ్యక్తితో భార్య చాటింగ్ చేస్తుందన్న అనుమానంతో భర్త దారు ణానికి పాల్పడిన ఘటన అల్వాల్‌లో కలకలం రేపింది.అల్వాల్‌కు చెందిన అరుణకు తొమ్మిది నెలల క్రితమే వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె గర్భిణీగా ఉన్నట్లు సమాచారం. అయితే కొంతకాలంగా అరుణ మరో వ్యక్తితో వాట్సాప్‌లో చాటింగ్ చేస్తుందంటూ భర్త అనుమానం పెంచు కున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి వాట్సాప్ చాటింగ్ విషయమై భార్యను భర్త నిలదీసి అడిగాడు. అనుమానం కాస్తా తీవ్ర రూపం దాల్చడంతో అరుణపై భర్త దాడి చేసి హత్య చేశాడు. గర్భిణీ అయిన భార్యను భర్త హత్య చేయడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, భార్యాభర్తల మధ్య గతంలో ఏమైనా వివాదాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తొమ్మిది నెలల క్రితం మొదలైన వైవాహిక జీవితం.. అనుమానంతో విషాదాంతంగా మారడం తో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు. [ Hyderabad crime, Alwal murder news, Pregnant wife killed, Husband kills wife, Telangana news, Latest Crime news ]
http://www.teluguone.com/news/content/[-hyderabad-crime-24-231418.html




